: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
నిత్యావసర వస్తువులే కాదు, చమురు ధరలు కూడా మళ్లీ పెరిగాయి. కిలో టమోటా 100 రూపాయలకు చేరడంతో దేశం వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో చమరు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్ పై 5 పైసలు పెంచగా, లీటర్ డీజిల్ పై రూపాయి ఇరవై ఐదు పైసలు పెంచినట్టు చమురు రంగ సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయని తెలిపాయి. గత రెండు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి కావడం విశేషం.