: కత్రినా సినిమాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సొంతమవుతున్నాయి!
సాధారణంగా ఓ సినిమా కథను తయారు చేసేటప్పుడు ఆ సినిమాకు ఎలాంటి నటీనటులు ఉండాలో కథకుడు స్పష్టంగా ఊహించుకుంటాడు. కొన్నిసార్లు స్టార్ల ఇమేజ్ ను ఊహించి కథలు తయారు చేసుకుంటాడు. అయితే వివిధ కారణాల వల్ల వారు నటించడం కుదరక ఇంకొకరు ఆ పాత్రల్లో నటిస్తుంటారు. అవి సూపర్ ఫ్లాపులైతే... అవి నేను వదిలేయడమే మంచిదైందని సదరు తారలు అనుకుంటారు. అదే సూపర్ హిట్టైతే 'అయ్యో వదులుకున్నానే' అని ఫీలవుతారు. దీనిని సినీ పరిశ్రమలో ఒకరి పాలిట శాపం, మరొకరి పాలిట వరం అయ్యిందని పేర్కొంటారు. అలాంటి సంఘటనలు కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు కూడా ఎదురయ్యాయి. కిక్ సినిమాలో తొలుత కత్రినాను తీసుకోవాలని భావించగా, రణ్ బీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన కత్రినా, ఇకపై సల్మాన్ తో నటించకూడదని నిర్ణయించుకుంది. దీంతో ఆ సినిమాను తిరస్కరించింది. దీంతో ఆ ఆఫర్ జాక్వెలిన్ ను వరించింది. ఆ సినిమా సూపర్ హిట్టై కోట్లు కొల్లగొట్టింది. ఆ తరువాత్ 'రాయ్' సినిమా ఆఫర్ కత్రినా వద్దకు వెళ్లింది. అయితే, తనను మోసం చేసిన రణ్ బీర్ తో నటించకూడదని నిర్ణయించుకున్న కత్రినా దానిని కూడా తిరస్కరించింది. దాంతో అది కూడా జాక్వెలిన్ ను వరించింది. తాజాగా సల్మాన్ సొంత సినిమాలో తొలుత కత్రినాను తీసుకోవాలని భావించినా 'కిక్' భామతో ఉన్న పరిచయం కొద్దీ ఆమెనే మళ్లీ తీసుకున్నాడు. విశేషం ఏమిటంటే, ఈ ఇద్దరికీ హిందీ రాదు, ఇద్దరూ ఇంగ్లీష్ దంచుతారు. ఇద్దరి ఫిజిక్ కూడా ఒకేలా ఉంటుంది. ఇద్దరూ భారతీయులు కాదు. ఇలా వీరిద్దరి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయని, ఒకరి ఆఫర్లు ఇంకొకరికి వెళ్లడం కూడా చిత్రం కాదని బాలీవుడ్ పేర్కొంటోంది.