: ఓర్ మ్యాక్స్ ఇండియా సర్వేలో దీపికా పదుకునే నెంబర్ వన్, కత్రినా నెంబర్ 2
ఓర్ మ్యాక్స్ ఇండియా స్టోర్ నిర్వహించిన సర్వేలో అంత్యంత పాప్యులారిటీ ఉన్న నటీమణుల ర్యాంకుల్లో దీపికా పదుకునే నెంబర్ వన్ గా నిలవగా, కత్రినా కైఫ్ నెంబర్ టూలో ఉంది. మూడవ స్థానంలో కరీనా కపూర్ నిలవడం విశేషం. నాలుగో స్థానంలో ప్రియాంకా చోప్రా నిలవగా, సినిమాల్లో రీఎంట్రీతో సరైన హిట్ సాధించలేకపోయిన ఐశ్వర్యారాయ్ ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో అలియా భట్, శ్రద్ధా కపూర్ నిలవగా, వెటరన్ లు కాజోల్, మాధురీ దీక్షిత్ వారి తరువాతి స్థానాల్లో నిలిచి యువనటీమణులకు పోటీ ఇచ్చారు. వరుస హిట్లతో సత్తా చాటుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెస్ పదో స్థానంలో నిలవడం విశేషం. కాగా, ప్రతి నెలా ఓర్ మ్యాక్స్ మీడియా ‘ఓర్ మ్యాక్స్ స్టార్స్ ఇండియా లవర్స్’ పేరిట ఇండియాలోని 29 నగరాల్లో సర్వే నిర్వహిస్తుంది. బాలీవుడ్ సెలబ్రెటీల సినిమాలు, టీవీలు, ఈవెంట్లలో పాల్గొన్న సందర్భంగా ఎవరు పాప్యులారిటీ కలిగిన వారని సర్వే నిర్వహించి, దానిని బట్టి ర్యాంకింగ్స్ ఇస్తారు.