: నరమేధం సృష్టించిన తీవ్రవాదిపై కంటే నామీదే ఒబామాకు ఎక్కువ కోపం: ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓర్లాండోలోని పల్స్ కేఫ్ లో నరమేధం సృష్టించిన మతీన్ పై చూపించాల్సిన కోపం కంటే తనపై ఒబామా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఒబామాకు తనపై ఉండాల్సిన కోపం కంటే రెట్టింపు స్థాయిలో మతీన్ పై ఆగ్రహం ఉండాలని ట్రంప్ సూచించారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని తగ్గించేందుకు తాను పని చేస్తానని ఆయన తెలిపారు.