: ప్రకాశం బాధ్యతలు బాలినేనికి అప్పగించిన జగన్
ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా బాలినేని ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పడిన నాయకుల కొరతను తీర్చేలా కొత్త నేతలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఉన్న జగన్, కింది స్థాయి నేతల్లో నాయకులను వెలికితీసే బాధ్యతనూ బాలినేనికి అప్పగించినట్టు తెలుస్తోంది.