: ఎన్ఎస్జీలో భారత్ కు అవకాశమిస్తే మాకు ప్రమాదం: చైనా అధికార మీడియా
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం పొందేందుకు ఇండియా మరో అడుగు ముందుకు వేసిన వేళ, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా, తన స్వరాన్ని మరింతగా పెంచింది. ఎన్ఎస్జీలో ఇండియాను చేరిస్తే, పాకిస్థాన్ ను రెచ్చగొట్టినట్టు అవుతుందని ఆ దేశ అధికార మీడియా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. తమ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయని, అది తమకు ప్రమాదమని పేర్కొంది. దక్షిణాసియాలో తీవ్ర అణ్వస్త్ర పోటీ నెలకొంటుందని తన భయాన్ని వ్యక్తం చేస్తూ, ఇండియాకు సభ్యత్వం ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది.