: స్వయంగా డైపర్లు మారుస్తూ, పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతున్న విరాట్ కోహ్లీ!
ఇంకా పెళ్లి కాని విరాట్ కోహ్లీ పిల్లలకు డైపర్లు మార్చడం ఏంటి? పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా? నిజమే. ప్రస్తుతం ఆటకు కాస్తంత విశ్రాంతి నిచ్చి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన స్టార్ వరల్డ్ చానల్ కోసం తారా శర్మ నిర్మిస్తున్న షోలో పాల్గొని మాట్లాడాడు. ఈ సందర్భంగా తాను పిల్లలకు డైపర్లను మార్చానని చెప్పిన కోహ్లీ, పిల్లలను ఎలా పెంచాలో కూడా చెప్పాడని తారా శర్మ వివరించింది. అతి త్వరలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో చిన్నారులకు కోహ్లీ విలువైన సలహా సూచనలు ఇచ్చాడని, ఇంటర్వ్యూ ఆద్యంతం ఉత్సాహంగా సాగిందని తార చెప్పింది. తనకు నచ్చినందునే క్రికెట్ రంగంలో ఉన్నానని, ఎవరికి నచ్చిన రంగాన్ని వారు ఎంచుకోవాలని కూడా కోహ్లీ అన్నాడట. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ప్రోమోలు స్టార్ టీవీ చానళ్లలో ప్రసారమవుతూ, కోహ్లీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.