: టమోటో చెట్టు దొరికితే ఉరేసుకునేవాడిని: జింబాబ్వే కోచ్ ఎన్తిని


ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న వన్డ్ సిరీస్ లో కనీసం పోరాటం కూడా చేయకుండా ఓడిపోతున్న తమ దేశపు క్రికెట్ జట్టుపై జింబాబ్వే అభిమానులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుండగా, ఆ దేశ తాత్కాలిక కోచ్, మాజీ పేస్ బౌలర్ ముకయా ఎన్తినికి టమోటో చెట్టుకు ఉరేసుకోవాలని అనిపించిందట. భారత్ పై వరుసగా ఓడిపోవడం తనకు బాధ కలిగిస్తోందని, ఓడిపోవడాన్ని చూసిన తనకు బతకాలని ఎంతమాత్రమూ లేదని చెప్పిన ఎన్తిని, స్టేడియం బయట టమోటో చెట్టుంటే ఉరేసుకుని మరణించాలని భావించానని, అయితే, బయట చెట్టు లేదని, ఆటగాళ్ల ప్రదర్శనను ఎద్దేవా చేశాడు. హరారే స్టేడియం బయట టమోటో చెట్లు లేవని, ఉంటే ఎందరో ఆత్మహత్యలు చేసుకునే వార్తలు మీడియాకు చిక్కేవని అన్నాడు. మూడు వన్డే సిరీస్ లో రెండు మ్యాచ్ ల్లోనే జింబాబ్వే సిరీస్ ను కోల్పోగా, అభిమానులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News