: కాంఢ్లా... మరో కైరానా!: ముస్లింల భయంతో ఇళ్లు వదలిన 63 హిందూ కుటుంబాలు!
మెజారిటీ ముస్లింలు దాడులు చేస్తారన్న భయంతో కుటుంబాలకు కుటుంబాలు ఊరిని వదిలేసిన ఉత్తరప్రదేశ్ పట్టణం కైరానా.. జాతీయ మీడియా పతాక శీర్షికలకెక్కింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ నియమించిన కమిటీ నేడు కైరానాలో పర్యటించనుంది. అదే సమయంలో మరో కైరానాగా అదే రాష్ట్రానికి చెందిన మరో చిన్న పట్టణం కాంఢ్లా మారిపోయిందన్న వార్తలు గుప్పుమన్నాయి. మెజారిటీ ముస్లిం జనాభాను చూసి భయభ్రాంతులకు గురైన హిందువులు కాంఢ్లాను వదిలి వెళుతున్నారు. ఇప్పటికే కాంఢ్లా నుంచి 63 హిందూ కుటుంబాలు ఆ పట్టణాన్ని వదిలి వెళ్లాయని బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ చెప్పారు. ఆది నుంచి కాంఢ్లాలో ముస్లింల జనాభా అధికంగా ఉన్నా... తాజాగా ఆ జానాభా మరింత మేర పెరిగింది. ప్రస్తుతం కాంఢ్లా జనాభా 26 వేలుండగా, హిందువుల జనాభా కేవలం 8 వేలు మాత్రమే ఉందట. ఈ కారణంగానే మెజారిటీ ముస్లింలు ఎక్కడ దాడులు చేస్తారోనన్న భయంతోనే హిందువులు ఆ పట్టణాన్ని వీడి వెళుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.