: నేడే జింబాబ్వేతో భారత్ మూడో వన్డే.. మరోసారి సత్తా చాటేందుకు యువ భారత జట్టు రెడీ
జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా ప్రత్యర్థి జట్టుపై ఈరోజు ఆఖరి వన్డే ఆడనుంది. జింబాబ్వేతో కొనసాగుతోన్న మూడు వన్డేల్లో రెండు గెలుచుకుని సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, ఈరోజు జరిగే ఆఖరి వన్డేనూ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలన్న పట్టుదలతో ఉంది. ధోని నేతృత్వంలో టీమిండియా యువ ఆటగాళ్లు అంచనాలకు మించే రాణిస్తున్నారు. మరోసారి సత్తా చాటాలని చూస్తున్నారు. జింబాబ్వే ఏ దశలోనూ మెరుగైన ఆటతీరు కనపర్చకపోతుండడంతో బింబాబ్వే-ఇండియా టీమ్‌ల మధ్య కొనసాగుతోన్న మ్యాచ్‌లు అభిమానులను అలరించలేకపోతున్నాయి. భారత్ ధాటికి జింబాబ్వే దాదాపు అన్నింటా విఫలమైంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లోనైనా రాణించి పరువుకాపాడుకోవాలని జింబాబ్వే చూస్తోంది. నామమాత్రమైన నేటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా జట్టులో ప్రయోగాలు చేయనుంది.