: 6 జీబీ ర్యామ్, 4కే డిస్ ప్లేతో 'వన్ ప్లస్ 3'
అత్యాధునిక సౌకర్యాలున్న స్మార్ట్ ఫోన్లను వాడాలని భావించే యూజర్ల కోసం ఆకర్షణీయ ఫీచర్లను కలిగివున్న మరో ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మూడు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసి విజయవంతమైన వన్ ప్లస్, తాజాగా వన్ ప్లస్ 3 పేరిట మరో కొత్త ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ లో 4కే రెజల్యూషన్ డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీలు ప్రధాన ఆకర్షణ. కేవలం 30 నిమిషాల చార్జింగ్ తో 60 శాతం బ్యాటరీ నిండుతుందని, వైఫై, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-2 పోర్టు, 5.5 అంగుళాల స్క్రీన్, 1.66 జీహెచ్ ప్రాసెసర్, 16/8 ఎంపీ కెమెరాలు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ 6.0.1, తదితర సదుపాయాలున్న ఫోన్ ధర రూ. 27,999 అని వన్ ప్లస్ తెలిపింది.