: ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్ అధిష్ఠానం!... ‘కో-ఆర్డినేషన్’ కోసం హైదరాబాదుకు డిగ్గీ రాజా, కొప్పుల రాజు


టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్ బ్రదర్స్ ఆ పార్టీ అధిష్ఠానానికి పెద్ద షాకే ఇచ్చారు. తమతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను వారు తమ వెంట టీఆర్ఎస్ లోకి తీసుకెళుతున్నారు. నేడు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో జరగనున్న కార్యక్రమంలో వారంతా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గుత్తా, వివేక్ బ్రదర్స్ పార్టీ మారుతున్నట్లు చాలా రోజుల నుంచి వదంతులు వినిపించినా... కాంగ్రెస్ అధిష్ఠానం అంతగా పట్టించుకోలేదు. తాజాగా గుత్తా అండ్ కో టీఆర్ఎస్ లో చేరుతున్న నేడు... టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీ కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ తో పాటు పార్టీ ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు ఇప్పటికే హైదరాబాదు చేరుకున్నారు. ఓ వైపు పార్టీ కీలక నేతలు దూరమవుతున్న రోజే... మరో వైపు టీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ జరుగుతుండటం ఆసక్తికర చర్చకు తెర లేపింది.

  • Loading...

More Telugu News