: అమెరికాను టార్గెట్ చేస్తే... మీకు మూడినట్టే!: ఐఎస్ కు ఒబామా వార్నింగ్


ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్)కు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు నిన్న తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాను, ఆ దేశ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంటే... ఐఎస్ ఉగ్రవాదులకు ప్రపంచంలో ఎక్కడ కూడా సురక్షిత స్థానం దొరికే అవకాశమే లేదని ఆయన హెచ్చరించారు. ఓర్లాండో నైట్ క్లబ్ ను నిన్న సందర్శించిన సందర్భంగా మాట్లాడిన ఒబామా... తమ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు కొనసాగిస్తున్న దాడుల కారణంగా ఐఎస్ ఇప్పటికే చాలా బలహీనపడిపోయిందని చెప్పారు. ఐఎస్ కు గట్టి పట్టున్న ఇరాక్, సిరియాలోనూ ఆ సంస్థ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన 120 మంది అగ్ర నేతలను సంకీర్ణ సేనలు మట్టుబెట్టాయని ఆయన పేర్కొన్నారు. ఐఎస్ లో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోందని ఒబామా తెలిపారు.

  • Loading...

More Telugu News