: క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం...వైద్యం తప్పనిసరి: వైద్యులు


కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో గత ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడకు వెంటనే వైద్యం అందించాలని, లేని పక్షంలో ప్రమాదం పొంచి ఉందని అక్కడి వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాజమండ్రిలో వారు మాట్లాడుతూ, ముద్రగడకు ఎంత చెప్పినా ఆయన వినిపించుకోవడం లేదని, కుటుంబ సభ్యులు, బంధువులు సూచిస్తున్నా ఆయన వైద్యానికి అంగీకరించడం లేదని, కనీసం వైద్య పరీక్షలకు రక్త నమూనా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో ఆయనకు బలవంతంగా వైద్యం చేయాలని అధికారులకు సూచించామని వారు తెలిపారు. అయితే ఆయన అంగీకరించకుండా వైద్యం చేయడం అంత సులభం కాదని వారు తెలిపారు. ముద్రగడ సానుకూలంగా స్పందిస్తే వైద్యం అందిస్తామని వారు చెప్పారు. కాగా, తుని ఘటనపై అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News