: ప్రపంచ అత్యుత్తమ అథ్లెట్ అనిపించుకునేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడంటున్న ఫిజియో
ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్ అయ్యేందుకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సిద్ధమయ్యాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫిట్ నెస్ ట్రైనర్ శంకర్ బసూ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కోహ్లీ బలం పుంజుకోవాలని కోరుకుంటున్నాడని అన్నారు. గతంలో సింగిల్స్ గ్రౌండ్ షాట్స్ పై ఆధారపడిన కోహ్లీ, ఫోర్లు, సిక్సర్లను అవలీలగా కొడుతున్నప్పటికీ మరింత మెరుగైన ఫిట్ నెస్ సాధించాలని తపన పడుతున్నాడని ఆయన చెప్పారు. అందుకోసం కోహ్లీ మరింత కఠోర శ్రమ చేయాలనుకుంటున్నాడని ఆయన తెలిపారు. కోహ్లీకి అవసరమైన ట్రైనింగ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. కోహ్లీని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. కోహ్లీ అద్వితీయమైన వ్యక్తి అని, ఐపీఎల్ ఆరంభం నుంచి అతనితో తనకు సాన్నిహిత్యం ఉందని, అతనిని మరింత ఫిట్ గా తయారు చేయడం తన కర్తవ్యమని ఆయన చెప్పారు.