: 'అన్న క్యాంటీన్'ల ఏర్పాటుపై ఏపీ సీఎం సమీక్ష
అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పౌర సరఫరాల శాఖ అధికారులతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. అమరావతిలో 'అన్న క్యాంటీన్ల' ఏర్పాటుకు రూపొందించాల్సిన ప్రణాళికపై చంద్రబాబు మంత్రులు, అధికారుల సూచనలు తీసుకుంటున్నారు. అన్న క్యాంటీన్లపై చర్చించిన తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.