: చంద్రబాబు ప్రతీ ఇంటికీ ఓ విమానం కూడా కొనిస్తానంటారు!: జగన్ సెటైర్
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలో జరిపిన విస్తృతస్థాయి సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. రైతులకు రుణ విముక్తి కలిగిస్తామన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు..?’ అని ఆయన ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారు. చంద్రబాబు ఎన్నో అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. ‘చంద్రబాబుని ఇలాగే వదిలేస్తే.. ఒక్కో ఇంటికీ ఒక్కో కారు కొనిస్తానంటారు.. విమానం కొనిస్తానంటారు’ అంటూ ఎద్దేవా చేశారు. రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే రాజకీయ నాయకుడు మోసం చేస్తే చెప్పులు, చీపుళ్లూ చూపించాలని జగన్ మరోసారి అన్నారు.