: కరుడుగట్టిన హిజ్ బుల్ ఉగ్రవాది బుర్హాన్ హతం


కరుడుగట్టిన హిజ్ బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, ఎంతో కాలంగా భారత సైన్యానికి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న బుర్హాన్ ను భద్రతా బలగాలు కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టాయి. జమ్మూకాశ్మీర్ లోని త్రాల్ సమీపంలోని గుల్షన్ పొరా అటవీ ప్రాంతంలో బుర్హాన్ తలదాచుకున్నాడని తెలుసుకున్న సైన్యం, సోదాలు జరుపుతుండగా, బుర్హాన్ కాల్పులకు తెగబడ్డాడు. ఆపై సైన్యం జరిపిన కాల్పుల్లో బుర్హాన్ హతుడైనట్టు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలిలో భారీగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు.

  • Loading...

More Telugu News