: చంద్రబాబుని విలన్ రాజనాలతో పోల్చిన జగన్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతాయుతమైన పనిలో ఉంటూ ఒక విలన్ లా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘సినిమాల్లో ఓ విలన్ ఉంటాడు.. ఎంతోమందిని ఆ విలన్ బాధపెడుతుంటాడు.. రాజనాల అటువంటి పాత్రలు పోషించేవాడు. నిజజీవితంలో చంద్రబాబు అలాగే ప్రవర్తిస్తున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు. ‘పదమూడు రీళ్ల వరకు తన దుష్ట చేష్టలతో విలనే కనిపిస్తుంటాడు. చివరికి పద్నాలుగవ రీలులో ప్రజల తరఫున పోరాడే హీరో వచ్చి ఆ విలన్ ని మట్టికరిపిస్తాడు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్ వేశారు. చంద్రబాబు పట్ల ప్రజావ్యతిరేకత వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు తీరు ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం అనేదే బతకదు’ అని ఆయన అన్నారు. ప్రభుత్వమంటే ప్రజలు, ఆ ప్రజలతోనే మనం బతకాలని జగన్ హితవు పలికారు.