: బాయ్ ఫ్రెండ్ పెట్టిన ముద్దు ఎంత పని చేసింది!


బాయ్ ఫ్రెండ్ పెట్టిన ముద్దు ఆమె ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఇంగ్లండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మరియమ్ లిమే (20) తన బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు ఓ హోటల్ కు వెళ్లింది. అతనితో మాట్లాడి వెనక్కి వచ్చేముందు ప్రియుడు ఆమెకు ముద్దుపెట్టి మరీ పంపించాడు. తరువాత కాసేపటికి ఆస్తమాతో బాధపడిన మరియమ్ కు ఊపిరి ఆడనట్టు అనిపించడంతో గిజగిజలాడిపోయింది. ఊపిరి తీసుకునేందుకు తీవ్రంగా కష్టపడి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు పోస్టు మార్టం చేసిన వైద్యులు బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన ముద్దే ఆమె ప్రాణాలు హరించిందని తేల్చారు. మరియమ్ ను ముద్దుపెట్టుకునే ముందు ఆమె బాయ్ ఫ్రెండ్ పీనట్ (వేరు శనగ) బటర్ స్కాచ్ శాండ్ విచ్ తిన్నాడు. అయితే, ఆస్తమాతో బాధపడేవారికి పీనట్ అలర్జీ... అది కొద్దిగా తిన్నా ప్రాణాలకే ప్రమాదం. దానిని తిన్న బాయ్ ఫ్రెండ్ ఆమెకు అధర చుంబనంతో ప్రేమను రుచి చూపించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తేల్చారు.

  • Loading...

More Telugu News