: తరలించండి.. సహకరిస్తాం: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించే ప్రక్రియ ఆగస్టు 15లోగా పూర్తవుతుందని సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ చెప్పారు. ఈరోజు హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ఉద్యోగులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను, కార్యాలయాలను ఏపీకి తరలించే క్రమంలో తాము ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఆ దిశగా పనులు జరుగుతున్నాయని, ఈనెల 27లోగా మున్సిపల్ శాఖ ఏపీకి తరలిపోతుందని ఆయన తెలిపారు.