: చరిత్రలో తొలిసారిగా మిగులు విద్యుత్ స్థాయికి ఎన్టీపీసీ
ప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) చరిత్రలోనే తొలిసారిగా డిమాండ్ కు మించిన విద్యుత్ ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది. విద్యాంచల్, ఊంచాహార్, రిహాంద్, దాద్రి ప్రాంతాల్లో సంస్థ నిర్వహిస్తున్న పవర్ ప్లాంట్లలో మిగులు విద్యుత్ నమోదవుతోందని సంస్థ ప్రకటించింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ ద్వారా యూనిట్ విద్యుత్ ను రూ. 1.91 నుంచి రూ. 2.64 మధ్య విక్రయిస్తున్నామని తెలిపింది. రోజువారీ డిమాండ్ ప్రాతిపదికన విద్యుత్ తయారు చేస్తుండగా, జూన్ 4 నుంచి 12 మధ్య విద్యుత్ మిగిలిపోయిందని ప్రకటించింది. కాగా, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలైన ఎన్ హెచ్పీసీ, నైవేలీ లిగ్నైట్ తదితర కంపెనీలు అతి త్వరలోనే మిగులు విద్యుత్ స్థాయికి చేరుతాయని నిపుణులు వ్యాఖ్యానించారు.