: సిమ్లాలో సోనియా, ప్రియాంకా!... హాలీడేకు వెళ్లారట!


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి సిమ్లాలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీ నుంచి కలిసే వెళ్లి తల్లీకూతుళ్లు అక్కడి చల్లని ప్రదేశంలో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారట. ఈ మేరకు సిమ్లాలోని ఛారబ్రాలో వారిద్దరూ సరదాగా కాలక్షేపం చేస్తున్న ఫొటోలు జాతీయ మీడియాలో దర్శనమిచ్చాయి. హాలీడేస్ కే వెళ్లినప్పటికీ ఛారబ్రాలో తాము కొత్తగా కట్టుకుంటున్న ఇంటిని వారు ఓ సారి పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చిన సదరు భవంతిని ప్రియాంకా గాంధీ తన అభిరుచికి అనుగుణంగా కట్టించుకుంటున్నట్లు గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News