: చంద్రబాబు కుయుక్తులను ఏ విధంగా అధిగమించాలో చర్చిద్దాం: వైసీపీ నేతలకు జగన్ పిలుపు
‘చంద్రబాబు పన్నే కుయుక్తులను ఏ విధంగా అధిగమించాలో చర్చిద్దాం’ అని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఈరోజు విజయవాడలో ప్రారంభమైన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభంలో ఆయన మాట్లాడారు. వైసీపీలో ఐదేళ్ల క్రితం విజయమ్మ, తాను మాత్రమే ఉన్నామని ఆ తరువాత పార్టీ అంచెలంచెలుగా ఎదిగిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టినప్పటినుంచి ప్రజల తరఫున తాము నిరంతరం ఉద్యమిస్తున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత వస్తోన్న పరిస్థితుల్లో తామంతా విజయవాడలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పరచినట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశం చివర్లో పార్టీ ఇకపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రసంగిస్తానని ఆయన చెప్పారు.