: పది మంది చైనా వాసులకు దేశ బహిష్కరణ నోటీసులు


అదానీ గ్రూప్ నియంత్రణలో దమ్రా పోర్టు కంపెనీ ఒడిశాలోని బద్రక్ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న పది మంది చైనా దేశస్తులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ బహిష్కరణ నోటీసులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు అందాయి. అత్యంత సున్నితమైన రక్షణ రంగ కార్యకలాపాలు సాగుతుండే భద్రక్ జిల్లాలో చైనా వాసులు తిరగడంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికలను అందుకున్న ఒడిశా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. చట్టప్రకారం, వారిని రాష్ట్రం నుంచి, ఆపై దేశం నుంచి పంపించేందుకు చర్యలు చేపట్టినట్టు ఒడిశా హోం శాఖ కార్యదర్శి అసిత్ త్రిపాఠి వెల్లడించారు. థాయ్ కంపెనీకి చెందిన వీరు కొన్ని నెలలుగా పోర్టు పనుల్లో ఉన్నారని తెలిపారు. బిజినెస్ వీసాలపై ఇండియాకు వచ్చిన వీరు, థాయ్ కంపెనీ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని వివరించారు. ఈ పది మందికీ నోటీసులు అందించామన్నారు. మొత్తం 19 మంది ఇక్కడ పనిచేసేందుకు రాగా, వారిలో 9 మంది ఇప్పటికే వెనక్కు వెళ్లిపోయారని తెలిపారు.

  • Loading...

More Telugu News