: నేలపై కూర్చుని కుర్రాళ్లతో కలిసి విందారగించిన కెప్టెన్ కూల్


అంతా కొత్త కుర్రాళ్లతోనే వెళుతున్న కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి జింబాబ్వే పర్యటన పెను సవాలేనన్న వాదన పటాపంచలైంది. కుర్రాళ్లైనా కెప్టెన్ కూల్ మార్గదర్శకత్వంలో సత్తా చాటారు. రెండు వరుస విజయాలతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకున్నారు. తొలి విజయం తర్వాత నిన్నటి రెండో మ్యాచ్ కు సిద్ధమయ్యే క్రమంలో మొన్న తీవ్ర కసరత్తులు చేసిన ధోనీ సేన... ఆ తర్వాత అంతా కలిసి విందారగించారు. అది కూడా అంతా రౌండ్ గా కింద నేలపై కూర్చుని నవ్వుతూ, తుళ్లుతూ భోంచేశారు. అంతా కొత్త కుర్రాళ్లే అయినా... వారి పక్కనే కూర్చుని ధోనీ విందు ఆరగించాడు. ఈ అరుదైన సన్నివేశాన్ని సెల్ఫీ తీసుకున్న ధోనీ దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News