: బీహార్‌లో ఇస్లాం మతంలోకి మారాలంటూ హిందూ మహిళకు చిత్రహింసలు
ఇస్లాం మతంలోకి మారి తమ విధానాలని అనుసరించాలంటూ ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. కోల్‌కతా వాసి అయిన ఓ హిందూ మహిళ పాట్నాలోని ఫుల్వారీ వాసి అయిన ఆసిఫ్‌ను వివాహమాడింది. అనంతరం ఆసిఫ్ తన కుటుంబ సభ్యులతో కలసి తన భార్యను ఇస్లాం మతంలోకి మార్చాడు. అంతేగాక, ఆమెను మదర్సాలో ఉంచాడు. అక్కడ ఆమె తీవ్ర చిత్రహింసలకు గురయింది. ఆమె చేత బీఫ్ తినిపించారు. ఆమెను నగ్నంగా ఉంచి ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఇస్లాం మతంను తు.చ తప్పకుండా పాటించాలని సదరు మహిళను హెచ్చరించారు. లేదంటే తన నగ్న చిత్రాలను బయటపెడతామని బెదిరించారు. దీంతో బాధిత మహిళ పోలీసులని ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను చిత్రహింసకు గురిచేసిన ఇద్దరు వ్యక్తులని అరెస్టు చేశారు. ఘటన పట్ల దర్యాప్తు జరుపుతున్నారు.