: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం భారీ నష్టాలతో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఏ మాత్రం కోలుకోలేని స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతోనే ముగిశాయి. ఆసియా స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన మార్కెట్ల మీద బాగా చూపింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేల చూపులే చూశాయి. సెన్సెక్స్ 239 పాయింట్లు నష్టపోయి 26,397 వద్ద ముగిస్తే, నిఫ్టీ 59 పాయింట్లు నష్టపోయి 8,111పాయింట్ల వద్ద ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే రూ.67.13 గా ఉంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఐడియా సంస్థ షేర్లు అత్యధికంగా 3.57శాతం నష్టపోయి రూ.99.80 వద్ద ముగిస్తే, వీటితోపాటు టాటా మోటార్స్ డీవీఆర్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి. బీపీసీఎల్ సంస్థ షేర్లు 2.45శాతం లాభపడి రూ.1,011 వద్ద ముగిస్తే, వీటితో పాటు లుపిన్, డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్ సంస్థల షేర్లు ఈరోజు లాభపడ్డాయి.