: గాయం కారణంగా సిరీస్ నుంచి వార్నర్ అవుట్


వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నీ నుంచి ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిష్క్రమించాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో ఫీల్డింగ్ సందర్భంగా వార్నర్ గాయపడ్డాడు. అతని చూపుడు వేలు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో స్కానింగ్ చేసిన వైద్యులు ఆయనకు విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో వార్నర్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. కాగా, ఐపీఎల్ లో అత్యుత్తమ ఫాంతో టైటిల్ సాధించిన వార్నర్, ఆ తరువాత కూడా అదే ఫాంతో సత్తాచాటాడు. శనివారం జరిగిన వన్డేలో వార్నర్ సెంచరీ చేయడంతో ఆ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News