: శంషాబాద్లో కలకలం సృష్టిస్తున్న మహిళల అదృశ్యం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఒక చిన్నారి సహా ఇద్దరు మహిళలు అదృశ్యం కావడం సంచలనం సృష్టిస్తోంది. అక్కడి సిద్ధేశ్వర కాలనీకి చెందిన కిష్టమ్మ అనే మహిళ తన రెండేళ్ల కూతురు సహా అదృశ్యమైతే, అక్కడి పెద్దషాపూర్ ప్రాంతంలో తన అత్తారింటికి బయలుదేరిన కవిత అనే మరో మహిళ కూయడ కనిపించకుండా పోయింది. ఒకే సమయంలో శంషాబాద్ పరిధిలోని వేరు వేరు ప్రాంతాల్లో నిన్న మహిళలు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. మహిళల అదృశ్యంపై వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు మహిళల కోసం గాలిస్తున్నారు.