: హైకోర్టు విభజన సెగ.. న్యాయ‌వాదుల చ‌లో హైకోర్టు


తెలంగాణ న్యాయ‌వాదులు ఈరోజు మ‌రోసారి ఆందోళ‌న‌కు దిగారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో హైదరాబాదులో ఈవేళ చ‌లో హైకోర్టు కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టారు. ఈ నేప‌థ్యంలో హైకోర్టు వద్ద భారీగా పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. న్యాయవాదుల జేఏసీ ఇచ్చిన చ‌లో హైకోర్టు పిలుపుతో కోర్టుకు వ‌స్తోన్న న్యాయ‌వాదుల‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈరోజు కోర్టు విధులు నిర్వ‌హించాల్సిన న్యాయ‌వాదుల‌ను మాత్ర‌మే పోలీసులు కోర్టులోనికి అనుమ‌తిస్తున్నారు. న్యాయ‌వాదుల‌ చలో హైకోర్టు’ కార్యక్రమానికి అనుమతి లేదని హైదరాబాద్‌ సీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు ప‌రిస‌ర ప్రాంతాల్లో నిషేధాజ్ఞ‌లు ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News