: చాలాకాలానికి స్టెప్పేసిన చిరంజీవి... పదం కలిపిన శ్రీకాంత్, సునీల్, సాయి ధరమ్ తేజ్... వీడియూను మీరూ చూడండి!
తన 150వ చిత్రానికి సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి, గత రాత్రి జరిగిన సినీ మా అవార్డుల కార్యక్రమంలో స్టేజ్ పై గ్యాంగ్ లీడర్ చిత్రంలోని 'జీ ఏ ఎన్ జీ... గ్యాంగ్ గ్యాంగ్' పాటకు తనదైన శైలిలో స్టెప్పులేసి అదరగొట్టారు. చిరంజీవి డ్యాన్స్ చేస్తాడని ముందుగానే వార్తలు వచ్చినప్పటికీ, ఏ పాటకు వేస్తాడు? ఎవరితో వేస్తాడు? అన్న సస్పెన్స్ నెలకొంది. ఇక అవార్డు కార్యక్రమంలో చిరంజీవి స్టేజ్ పైకి రాగానే, హీరోలు సునీల్, సాయి ధరమ్ తేజ్, శ్రీకాంత్ తదితరులు చిరు గ్యాంగ్ సభ్యులుగా వచ్చి చేరారు. దీంతో అభిమానుల్లో ఆనందానికి అంతులేకుండా పోయింది. కాగా, 'టెంపర్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన ఎన్టీఆర్ కు చిరంజీవి, రాజేంద్రప్రసాద్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లు అవార్డును అందించారు.