: జనాన్ని ముంచేసిన వీవీఆర్ హౌసింగ్... పోలీసుల అదుపులో సంస్థ అధినేత?


తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ రంగంలో పేరెన్నికగన్న సంస్థ ‘వీవీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ అధినేత వాసుదేవరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.. ప్లాట్ల విక్రయాల్లో జనాన్ని మోసం చేశారన్న ఆరోపణలతో హైదరాబాదు, పంజాగుట్ట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లాట్ల విక్రయాలకు సంబంధించి వాసుదేవరావు చేతిలో మోసపోయామంటూ పెద్ద సంఖ్యలో బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరిన వాసుదేవరావు... గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనపై గతంలో కృష్ణా, మెదక్ జిల్లాల్లోనూ పలు కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News