: కర్ణాటకలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్


కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్యేలపై జేడీ (ఎస్) కన్నెర్ర చేసింది. రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా ఎనిమిది మంది జేడీ (ఎస్) ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. దీంతో క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ వారికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు దేవెగౌడ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానితో పాటే పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని వివరణ కోరారు. సస్పెన్షన్‌ కు గురైన ఎమ్మెల్యేల్లో జమీర్‌ అహ్మద్‌ ఖాన్, చలువరాయస్వామి, బాలకృష్ణ, ఇక్బాల్ అన్సారి, అఖండ శ్రీనివాసమూర్తి, బండిసిద్దేగౌడ, గోపాలయ్య, భీమేగౌడ ఉన్నారు. అసెంబ్లీలో జేడీ (ఎస్) బలం 40 ఉండగా, ఆ పార్టీ తరపున రాజ్యసభకు పోటీ చేసిన అభ్యర్థికి 33 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇలా క్రాస్ ఓటింగ్ జరగడంతో కాంగ్రెస్ మూడో అభ్యర్థిని సునాయాసంగా గెలిపించుకోగలిగింది. కాగా, కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ రామ్మూర్తి గెలుపొందారు.

  • Loading...

More Telugu News