: ఆ సినిమాలోంచి నన్ను తీసేశారు... లేకపోతే నా మొదటి సినిమా 'అంజి' అయ్యేది!: నిహారిక


మెగా హీరోయిన్ గా తెలుగు తెరపై అడుగుపెట్టనున్న నిహారిక తాను నటించిన 'ఒక మనసు' సినిమా విశేషాలు మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'అంజి' సినిమాలో తాను నటించానని చెప్పింది. అయితే పది రోజుల షూటింగ్ ముగిసిన తరువాత, 'వీళ్లు బాగా చిన్నపిల్లలు అయిపోయారు, ఈ సీన్లు కొంచెం పెద్దపిల్లలతో తీద్దా'మని చెప్పి, తనతో పాటు పని చేసిన మరో నలుగురు పిల్లలని షూటింగ్ నుంచి తీసేశారని చెప్పింది. లేకపోతే తన మొదటి సినిమా 'అంజి' అయిఉండేదని చెప్పింది. అలా కాకపోవడం వల్ల తన మొదటి సినిమా 'ఒక మనసు' అయిందని చెప్పింది. ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అని చెప్పింది. మంచి సినిమాలో నటించానన్న సంతృప్తి ఉండాలని ఈ సినిమాలో నటించానని నిహారిక వెల్లడించింది.

  • Loading...

More Telugu News