: మా నాన్న దీక్ష విరమించే ప్రశ్నేలేదు... ఏదైనా మాట్లాడాలంటే కాపు జేఏసీతో మాట్లాడండి!: ముద్రగడ కుమారుడు బాలు
తన తండ్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్షను విరమించే ప్రశ్నేలేదని ఆయన తనయుడు బాలు తెలిపాడు. విశాఖపట్టణంలో బాలు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ కుటుంబంపై వేధింపులకు దిగుతోందని అన్నాడు. తన తండ్రికి బలవంతంగా వైద్యం చేసినా, దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తుని ఘటనకు సంబంధించిన అరెస్టులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తన తండ్రితో ఏదైనా మాట్లాడాలనుకుంటే కాపు జేఏసీని సంప్రదించాలని ఆయన సలహా ఇచ్చారు. కాగా, ముద్రగడ దీక్ష కొనసాగుతున్న సంగతి తెలిసిందే.