: 10 మంది కేన్సర్ బాధిత పిల్లల్ని దత్తత తీసుకున్న రోహిత్ శెట్టి
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. కేన్సర్ తో బాధపడుతున్న 10 మంది చిన్నారులను దత్తత తీసుకున్నాడు. ప్రతి ఏటా కొంత మంది పిల్లలను దతత్త తీసుకుని వారికి విద్యావసరాలు చూస్తున్న రోహిత్ శెట్టి... కొంత మంది కేన్సర్ బాధితులకు సహాయసహకారాలు అందించేవాడు. అయితే తాజాగా ఏకంగా 10 మంది కేన్సర్ బాధిత చిన్నారులను దత్తత తీసుకోవడం అతని సేవానిరతిని తెలియజేస్తుందని బాలీవుడ్ నటులు ప్రశంసిస్తున్నారు. దత్తత తీసుకున్న వారందరికీ వైద్యసహాయంతో పాటు, వారి విద్యకు ఏర్పాట్లు చేయనున్నట్టు రోహిత్ శెట్టి తెలిపాడు. బాలీవుడ్ లో భారీ చిత్రాలను నిర్మించి, వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టే అగ్ర దర్శకుడిగా రోహిత్ శెట్టికి పేరుంది.