: చంద్రబాబు చానా ఇంటలిజంట్... ముద్రగడను కాపులతోనే తిట్టిస్తుండు: వీహెచ్
కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం అంటే చంద్రబాబుకు ఎంతో భయం వేస్తోందని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. "చంద్రబాబు చానా ఇంటలిజెంట్. ముద్రగడను వేరే ఎవ్వరితోనో తిట్టిపిస్తలేడు. వాళ్ల సామాజిక వర్గం వాళ్లతో, కాపులతోనే తిట్టిపిస్తున్నడు. వీళ్లు గూడా బాబుకు 'డడ్డడ్డడ్డడ' అని భజన చేస్తుండ్రు" అని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదేనని, ముద్రగడను పరామర్శించేందుకు వచ్చిన తనను గదిలో నుంచి కదలనీయక పోవడం ఏంటని ప్రశ్నించారు.