: పెద్దమనిషిగా చెలామణి అవుతూ దొంగతనం కేసులో అరెస్టయిన నేత!
రావాడ గోవిందరెడ్డి... విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో పాత ఇనుము వ్యాపారం చేసుకునే వ్యక్తిగా, పాయకరావు పేట మండల పరిధిలోని శ్రీరాంపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ప్రజలకు తెలుసు. రైతు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లే తెలుగుదేశం పార్టీ నేతగా కూడా సుపరిచితమే. అయితేనేం, విశాఖ స్టీలు ప్లాంటు నుంచి రూ. 5.82 లక్షల విలువైన కాపర్ దిమ్మెలను దొంగిలించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. రైతు ప్రతినిధిగా ఉంటూ, ఇవేం పనులని ప్రజలు విస్తుపోగా, అరెస్టు చేసిన గోవిందరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, ఆయన్ను కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు తెలిపారు. గతంలో గోవిందరెడ్డిపై పలు దొంగతనం కేసులున్నాయని, జైలు శిక్ష కూడా అనుభవించాడని వివరించారు.