: భర్త సజీవదహనం అవుతుంటే, పక్కరూములో టీవీ చూస్తూ కూర్చున్న భార్య!


దశాబ్దాలుగా కలిసి కాపురం చేసిన తన భర్త ఓ వైపు మంటల్లో కాలిపోతూ ఉంటే, తాను మాత్రం తాపీగా టీవీ చూస్తూ గడిపిందో భార్య. అది కూడా పక్క గదిలోనే. ఈ ఘటన కోల్ కతాలోని మనిక్ తాలా గవర్నమెంట్ కాలనీలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రంజిత్ కుమార్ బరాత్ (63), సుతపా బరాత్ (57)లు భార్యా భర్తలు. సీఈఎస్సీ అధికారిగా పదవీ విరమణ చేసిన రంజిత్, తన భార్యతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి బెడ్ రూం గదిలో నుంచి దట్టమైన పొగలను చూసిన ఇరుగు, పొరుగు వారు పోలీసులకు, ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి భర్త ఓ గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండగా, మరో గదిలో లోపలివైపు నుంచి తలుపేసుకుని కూర్చుంది భార్య. తనను హత్య చేస్తాడన్న భయంతో గదిలో తలుపేసుకుని ఉన్నానని, గట్టిగా అరిచినా ఎవరూ రాలేదని ఆమె చెబుతుండగా, పోలీసులు మాత్రం ఈ ఘటన వెనుక పలు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. పోస్టుమార్టం తరువాతనే రంజిత్ మరణం ఎలా సంభవించిందన్న విషయాన్ని తేలుస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News