: 'కట్టప్ప కనిపించడం లేదు' అంటున్న సత్యరాజ్ కుమారుడు శిబీ!
కట్టప్ప... బాహుబలి సినిమా తరువాత పరిచయం అవసరం లేని పాత్ర. సత్యరాజ్ ప్రాణం పోసిన ఈ పాత్ర, చిత్రం చివర్లో వదిలిన ప్రశ్న 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?'కు సమాధానం కోసం ప్రతి సినీ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన కుమారుడు, తమిళ నటుడు శిబీ సత్యరాజ్ హీరోగా 'కట్టప్ప కనిపించడం లేదు' (కట్టప్పావ కానోమ్) అంటూ ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ విషయం తెలిసిన వాళ్లు, కట్టప్ప పాత్ర పాప్యులర్ కావడంతోనే ఈ పేరు పెట్టి వుంటారని అనుకుంటుండగా, సినిమా దర్శకుడు మణి వివరణ ఇచ్చారు. ఈ టైటిల్ కు, సినిమా కథకు సంబంధం ఉందని, అది సినిమా చూసి తెలుసుకోవాలని అనడం గమనార్హం.