: 'కబాలి' యాప్... సినీ పరిశ్రమలో సరికొత్త ప్రయోగం


సినిమాలు, సినీ నటులకు సంబంధించిన ఏ విషయమైనా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేదే. దీనిని క్యాష్ చేసుకునేందుకు సినీ నిర్మాతలు సరికొత్త పంథాలో సాగుతుంటారు. క్రేజీ కాంబినేషన్లు అభిమానుల్లో ఆసక్తి రేపుతుంటాయి. రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' టీజర్ సామాజిక మాధ్యమాల్లో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. దీనిని క్యాష్ చేసుకునేందుకు 'కబాలి' యాప్'ను సినీ నిర్మాతలు రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా ఈ యాప్ ద్వారా తెలియజేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఈ మేరకు యాప్ ను నేడు ఆవిష్కరించారు. ఇది ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుందో చూడాలి.

  • Loading...

More Telugu News