: బోపన్నకు షాక్... లియాండర్ పేస్ తోనే కలిసి ఆడాలని భారత టెన్నిస్ సమాఖ్య ఆదేశం
రియో ఒలింపిక్స్ లో భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కు షాకిచ్చిన యువ టెన్నిస్ స్టార్ రాహుల్ బోపన్నకు భారత టెన్నిస్ సమాఖ్య భారీ షాకిచ్చింది. రియో ఒలింపిక్స్ లో లియాండర్ పేస్ తో కలిసి ఆడాల్సిందేనని బోపన్నకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. రియోలో పేస్ తో కలిసి ఆడలేనని నిన్న ప్రకటించిన బోపన్న... విశాఖ కుర్రాడు సాకేత్ తో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే జరిగితే పేస్ రియో ఒలింపిక్స్ కు వెళ్లడం దాదాపుగా అసాధ్యం. ఈ నేపథ్యంలో పేస్ సినియారిటీని పరిగణనలోకి తీసుకున్న సమాఖ్య... బోపన్న నిర్ణయాన్ని తోసిపుచ్చింది. దీంతో రియో ఒలింపిక్స్ లో ఆడే విషయానికి సంబంధించి పేస్ కు మార్గం సుగమం చేసింది.