: దీక్ష విరమిస్తే సీబీఐ విచారణ జరిపిస్తాం.. ముద్రగడకు ప్రభుత్వ సందేశం
తుని విధ్వంసం ఘటన కేసులో అరెస్టులకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపునేత ముద్రగడకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌తో ఓ సందేశాన్ని పంపించింది. తన అరెస్టు తరువాత కూడా ప్రభుత్వాసుపత్రిలో ముద్రగడ దీక్షను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ముద్రగడ తాను చేస్తోన్న ఆమరణ నిరశనను విరమించాలని ప్రభుత్వం కోరింది. దీక్ష విరమిస్తే తుని ఘటనపై సీబీఐతో విచారణను జరిపిస్తామని చెప్పింది. అయితే ఎస్పీ తెచ్చిన ప్రభుత్వ సందేశాన్ని ముద్రగడ వ్యతిరేకించినట్లు సమాచారం. తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా తాను దీక్షకు దిగానని, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేస్తేనే తాను నిరశనను విరమిస్తానని ఆయన ఎస్పీతో చెప్పినట్లు సమాచారం.