: ముద్రగడకు ప్రత్యేక వైద్య సేవల కోసం కామినేని ఆదేశం
తుని ఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కాపునేత ముద్రగడ పద్మనాభంని పోలీసులు అరెస్టు చేసి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఆయనకు ప్రత్యేక వైద్యసేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ముద్రగడకు ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రి నుంచి రిస్క్ ఎసెస్మెంట్ బృందాన్ని ముద్రగడకు చికిత్స అందించడానికి తీసుకొస్తున్నారు. ఈ బృందంలో నలుగురు సీనియర్ వైద్యులు ఉన్నారు.