: పుట్టిన రోజు కేక్ కట్ చేసిన లాలూ.. శుభాకాంక్షలు తెలిపిన నితీశ్ కుమార్
రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నాలోని తన నివాసంలో నేడు తన 69వ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నారు. తన కుటుంబ సభ్యుల మధ్య ఆయన ఈరోజు ఉదయం కేక్ కట్ చేశారు. భార్య రబ్రీదేవితో పాటు తన కూతురు ఈ సందర్భంగా ఇచ్చిన పుష్పగుచ్చాన్ని ఆయన స్వీకరించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా పాట్నాలోని లాలూ నివాసానికి చేరుకుని ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. లాలూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టిన రోజు వేడుక సందర్భంగా ఆయన ఇంటి వద్ద పండగ వాతావరణం నెలకొంది.