: పసికూనలైనా ధోనీ సేనకు పెను సవాలే... మరికాసేపట్లో జింబాబ్వేతో తొలి వన్డే


జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా వన్డే జట్టు మరికాసేపట్లో ఆతిథ్య జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో సత్తా కలిగిన సారథిగా ప్రసిద్ధిగాంచిన మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ మ్యాచ్ పెద్ద సవాల్ నే విసరనుంది. ఎందుకంటే... మొత్తం కొత్త కుర్రాళ్లతో కూడిన జట్టుతో ధోని జింబాబ్వేలో అడుగుపెట్టాడు. అంబటి రాయుడు, అక్షర్ పటేల్, ధావల్ కులకర్ణి మినహా జట్టులోని ఏ ఒక్క అటగాడికి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ లలో అంతగా అనుభవం లేదు. టీమిండియాతో పోలిస్తే... పసికూన కిందే పరిగణిస్తున్న జింబాబ్వేతో మ్యాచ్ లో కొత్త కుర్రాళ్లకు అనుభవం వస్తుందన్న ఉద్దేశంతోనే బీసీసీఐ మొత్తం కొత్త కుర్నాళ్లనే ఇచ్చి ధోనీని అక్కడకు పంపింది. భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు హరారేలోని క్రికెట్ స్టేడియం వేదికగా నిలవనుంది.

  • Loading...

More Telugu News