: ముంబై బైకర్ ప్రాణాలను తీసేసిన స్టంట్స్... సోషల్ మీడియాలో వీడియో వైరల్
ముంబైకి చెందిన ఆ బైకర్ కు నిత్యం సాహసాలంటే అమితాసక్తి. బైక్ పై స్టంట్ లతో స్నేహితులతో మెప్పు పొందుతున్న అతడు ఇటీవల నడిరోడ్డుపై మరోసారి సాహసం చేశాడు. ఈ సందర్భంగా అతడు హెల్మెట్ లేకుండానే బైక్ పై గింగిరాలు తిరిగాడు. వెనుక స్నేహితులు ఈలలు వేస్తూ ఉత్సాహపరచడంతో మరింత జోరుగా బైక్ ను నడిపాడు. బైక్ ను తన చేతుల్లో బొమ్మలా తిప్పాడు. అయితే ఆ స్టంట్ లో అనుకోకుండా అతడు పట్టు తప్పాడు. బైక్ కింద పడిపోయింది. హెల్మెట్ లేకుండా కిందపడిపోయిన అతడి తల డివైడర్ కు కొట్టుకుంది. అంతే, ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవల మెరైన్ డ్రైవ్ వద్ద అతడు స్టంట్ చేస్తున్న సమయంలో అతడి స్నేహితులు ఈ వీడియో తీశారట. గత సోమవారం సోషల్ మీడియాలోకి ఎంట్రీ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది.