: గత ప్రభుత్వాలు రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టాయి: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా


గత ప్రభుత్వాలు అవినీతి, కుంభకోణాల రూపంలో రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న బీజేపీ ‘వికాస్ పర్వ్’ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నేల, ఆకాశం, సముద్రం అనే తేడా లేకుండా అన్నింటిపైన కుంభకోణాలు చేసిన ఘనత గత ప్రభుత్వాలదేనని విమర్శించారు. అరవైఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీ నాయకులు దేశానికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రజలతో నేరుగా మాట్లాడే నాయకుడిని తాము అందించామన్నారు. తమ పాలనలో అవినీతి, కుంభకోణాలు, లంచగొండితనం లేని దేశంగా భారత్ ను మార్చగలిగామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెబుతున్నానని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం కూడా రెండేళ్లు పూర్తి చేసుకుందని అమిత్ షా అన్నారు.

  • Loading...

More Telugu News