: కాంగ్రెస్ పార్టీని వీడను...కేసీఆర్ ను ఒక్కసారి కూడా కలవలేదు!: సురేష్ రెడ్డి


తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి ఖండించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను తాను కలవలేదని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం కట్టుకథ అని ఆయన తెలిపారు. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కనీసం ఒక్కసారి కూడా ఆయనను కలవలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రశ్న లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడతానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ తో తమది వందేళ్ల అనుబంధమని, దానిని వదులుకోలేనని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News